వేడకయే
వేడకయే
సస్యలక్ష్మి అందెలసడి..రాశులయే వేడుకయే..!
మకరదీప సంక్రాంతులు..విందులయే వేడుకయే..!
చేమంతుల పూబంతుల..మంతనాల దొంతరలే..
ఊరించే మంచుతెఱలు..నవ్వులయే వేడుకయే..!
బంధుమిత్ర పరిజనులను..ఒక్కచోట చేర్చేనా..
సరసరాగ వినోదాలు..ముగ్గులయే వేడుకయే..!
అరవిరిసిన గులాబీలు..పారిజాత పరిమళాలు..
అమృతప్రణయ భావనలే..సిగ్గులయే వేడుకయే..!
దిగివచ్చే శంకరమయ..రథమల్లదె మనోహరం..
ఊపిరింట శాంతిమంత్ర..గీతులయే వేడుకయే..!
ఆశయాల పతంగులను..మేఘాలే దాటించునె..
తెలుగుదనం విశ్వానికి..తేనెలయే వేడుకయే..!
నాదస్వర ధారలతో..జగములకే మేలుకొలుపు..
మరిమాధవ మౌనమదే..మెఱుపులయే వేడుకయే..!

