వేచిఉన్నా....!!
వేచిఉన్నా....!!
మూసిన కనులను మురిపించిన కలవే
ఇలా ఇలలో కలకాలం నను అలరించగ రావే
నువు తొలకరి చినుకులా పలకరించగా పురివిప్పిన విత్తునై నే మొలకెత్తగా….
ఏకమైన అభిరుచులే పెద్దలుగా మారి అల్లంతదూరాన ఉన్న మన ఇరువురిని పెనవేయగా …..
నీ ఎదురుచూపే నిను చేరేందుకు నా కనులకు పూలబాటగా మారగా….
వికసించిన చెలిమి చొరవ పరిమళాల మత్తు మోమాటపు దూరాలను చేరిపేయగా…..
అద్దం వద్దంటూ అనుక్షణం నీ వద్దే ఉండిపోనీ అని నా ప్రతిబింబమై నువే చెంతచేరగా….
నీ మనస్సునే యావదాస్తిగా రాసిస్తే ఆనందాల రాశులను ఆడుతూ పాడుతూ పండిద్దామా…..
భానుడు నేనై, జలము నీవై నూరేళ్ళ పంటను జతగా సేద్యం చేద్దామా….
వధువువై వస్తే జంటవిహంగాలై చేద్దామా విహారయాత్ర
జీవితపు సార్ధకత సాధనలో పోషిస్తావా కీలకపాత్ర