వచన కవితలు
వచన కవితలు


నిదురపోతున్నా నిదురపోకున్నా
మా కనుల ముందరే నాట్యం చేస్తున్నావు
ఎన్నిరోజులని నీ
నాట్యం చూసేము
ఎంత త్వరగా నీవు
తెరవేసి వెళతావు
గుడ్ నైట్ గాని
ఆల్ అవుట్ గాని
మాకివ్వ నంటుంది
మనః శాంతి నేమో...
అవును మరి
సర్కారీ మాటలను మీరు పాటిస్తేనే
నేనేమో మీ కనులకు
కానరాక పోతాను....
కనికరం లేక కడతేర్చు తున్నావు
కాస్తయినా ఆపవా
నా బుజ్జి కరోనా
నీ నుంచి మమ్మల్ని
కాపాడే పనిలోన
మా మంచి మనసున్న
మారాజులందరిని
మా నుంచి దూరం చేయకే
ఇకనైనా....
చుట్టపు చూపుగా వచ్చావు నీవు
చుట్టింది చాలులే
ఇక బయలుదేరు
ఎన్ని రోజులని
పోషించాలి నిన్ను
మా వల్ల కాలేదు
మర్యాదగా వెళ్ళు....