STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

వచ్చితివా స్వామీ

వచ్చితివా స్వామీ

1 min
288

నీ పాదములు విడువలేనని తెలిసి

నా పూజా ఫలముగా మారి

నా కోసం వచ్చితివా స్వామీ

నను మెచ్చితివా స్వామీ


అలనాటి గజేంద్రుని పిలుపులా అనిపించిందా

నా భక్తిలోని ఆర్త్రత నీకు తెలిసినదా

తులసీదళార్పణ ఫలముగా

వేగిరము వచ్చితివా బృందావన విహారీ


ఈ వేళా ఆ వేళా అని లేకుండా

ఎల్ల వేళలా నిన్ను స్మరించి

నీ నామముతో తరించి

నిన్ను దర్శించు భాగ్యముకై అడిగితినని


కృష్ణా!

ఈ నిమిత్తమాత్రుడి కోసం

ఈ ఆత్మకు మోక్షం ప్రసాదించుట కోసం

వచ్చితివా స్వామీ

నా మొర విని పరుగులిడి

వేణువును కూడా మరచి వచ్చి

నా జన్మ ధన్యం చేసితివా స్వామీ



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract