STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

వానలేల మనసుకి

వానలేల మనసుకి

1 min
310

ప్రేమవిలువ తెలుపలేని..మాటలేల మనకు..! 

చెలిమిపూల తోటలేక..శ్వాసలేల మనకు..! 


కలలు చేరె అందమైన..సమాధిలో ఇపుడు.. 

అలజడులకు తావిచ్చే..ఊహలేల మనకు..! 


ఎవ్వరేమి అనుకున్నా..అంటున్నా సరియె.. 

పరిమళాల వానకాని..వానలేల మనకు..! 


తాపాలకు సెలవివ్వగ..తరుణమిదే ఇంక.. 

కలిపినిలుపు పాటకాని..పాటలేల మనకు..! 


విషయవాసనా జగతిని..దాటేందుకు చూడు.. 

వెన్నెలింటి బాటకాని..బాటలేల మనకు..! 


శిల్పితోటి శిల్పానికి..ఉన్న బంధమేమి.. 

ప్రేమకి ఎఱుకలేని..ఆటలేల మనకు..!


Rate this content
Log in

Similar telugu poem from Romance