వాక్కు ఒక ఔషధంగా...
వాక్కు ఒక ఔషధంగా...
పద్యం:
వాక్కు వలన గలుగు వంద బంధములును
వాక్కు వలనె గలుగు భారి తగవు
పలుకు నుండె వచ్చు పరమోషధముయును
బుధ్ధి ధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! మాట మాట్లాడటం వలననే ఎన్ని సత్సంబంధాలను అయినా పెంచుకోవచ్చు. మాట మాట్లాడటం వలన ఎంత పెద్ద యుద్ధమైన జరగవచ్చు. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి మనం మాట్లాడే మాట ఒక ఔషధం గా కూడా పనికి వస్తుంది.