ఊసులు
ఊసులు
ఊసులు
ఏంటో
నీ ఊసుల్లో ఇంత మహిమ
చంద్రుడి వెన్నెల కాంతులు నీ కళ్ళలో దాచావా
సూర్యుడి వెచ్చని కిరణాలు నీ శ్వాసల్లో దాచావా
ప్రియా
నన్ను నీ కౌగిలిలో దాచుకోవా
నీ యదపై సేద తీరనీవా
ఒక్కసారి తిరిగి రావా
నా వేడుకోలు వినవా
నన్నీ ఎడబాటు నుంచి విడుదల చేసి
నీ కౌగిళ్ళలో బందీని చేయవా
నా చేతిలోని రోజాలా
నా మనసును వాడిపోనీయకు
తిరిగొచ్చి నా ప్రేమకు జీవం పోయవా