ఊపిరి
ఊపిరి
నిన్ను మరచిపోవాలని ఎంత ప్రయత్నంచేస్తున్నా
మరింత గుర్తు వస్తూవుంటావు
నిన్ను దూరం పెట్టాలని ఎంత అనుకుంటున్నా
మరింత దగ్గరైపోతున్నావు
నీతో మాట్లాడకుండా ఉండాలనుకుంటూనేవున్నా
అనుకున్న ప్రతిసారీ
గుండెల్లో గునపాలు గుచ్చుకుంటూ
కన్నీటి ఏరై పారుతున్నావు....
నరం నరం నలిపేసే బదులు
ఒకేసారి ప్రాణం తీయ్యొచ్చుగా
క్షణక్షణం సాధించే బదులు
ఒకేసారి ఊపిరి ఆపేయ్యొచ్చుగా...
...సిరి ✍️❤️

