ఊహలు గుసగుసలాడె
ఊహలు గుసగుసలాడె
కుందనపు బొమ్మకు చిరునవ్వే ఆభరణం
ఆనందమే అందం అదే జీవిత మకరందం
ఎండ వానల మనసుల్లో ఎన్ని ఊహలో
రంగురంగు ఊహాలన్నీ ఇంద్రధనుస్సులే!
ఈ వనితను చూసి వాన చిలుకలు
వంగివున్న పూలకొమ్మపై వాలి
పూలరెమ్మలను అమ్మడుపై....
వర్షించి ఆ నవ్వును పరిమళం చేశాయా!
గుడిలో గంటలు మ్రోగే...ఈ మదిలో
కోయిల కూసే,ఎదలో ఉన్నది మందిరమే
చింతలులేని సంసారం కోసం మనసుని
మందిర దేవునిఅద్దం ముందుంచడమే!
ప్రపంచమంతా భారతీయముందు
ఎందుకు మొకరిల్లుతుందో తెలిసిందా...
టోర్న్ జీన్స్ చింపిరి కంపు వికటించి
చీర సౌందర్యం ఆ కళ్ల గంతలు విప్పింది!
నల్లని వారు అనాగరికులన్న విమర్శకులే
మన చల్లని నేతచీరను కట్టుకొని ఆ...
స్వదేశంలో భారతీయత చూపుకొని
చప్పట్లు కొట్టించుకొని తరిస్తున్నారు!
ఈ కోమలాంగి కోరగా పూలవనాలు వంగి
వంగి దండమెట్టి పూలబాటలు వేయవా!
భారతీయ కట్టుబొట్టు చూడముచ్చటని
నేల నింగి పరవశించి ప్రచారం చేయవా.!
tyle="color: rgb(34, 34, 34);">పంచభూతాలూ ఒక్కోసారి విధివిధానాల్ని
ఆమెను చూసి సరిగ్గా సరిదిద్దుకుంటూ....
చులకనైపోకుండా ఆమె పక్కన నిలబడి
ఫోటో ప్రేమ్ ని అమ్ముకుంటున్నాయి కదా!
హరివిల్లు అక్కడే ఉండి వీరి జల్లూ ఉంది
హరితవనాలూ ఉన్నాయి నెమలి కన్నులు
హంస విహారాలూ ప్రకృతి అందాలతో నేల
నింగిపరిమళాలు అయినా అక్కడ"ఆమే"
ఎక్కడలేని తుమ్మెదలు లెక్కకుమించిన
సీతాకోకచిలుకలు ఎక్కడనుంచో.....
తూనీగలు ఆమెతో చక్కని చిక్కని స్నేహం
ముచ్చటగున్నది ఆ దృశ్యం ఎంచక్కా...!
అమ్మ అక్క చెల్లి చెలియ ఎవరనుకున్నా
ఆత్మసాక్షి గౌరవం,మనస్సాక్షి మన్నన....
చెట్టు..పుట్ట..గొడ్డు..గోదారి..పక్షి పసిపాప
అమ్మా అనిపిలిచి పులకరించిపోతాయి!
ఏడుమల్లెలఎత్తును ఎత్తుకొని నేలచూడు
దూదిపింజిలా సుకుమారి అయ్యింది
ఆ దూదిపింజను హత్తుకొన్న గాలి"గాలిబ్"
ఎండవెన్నెలలకు జాగ్రత్తే "ఆకంటిరెప్పలు"
ఎందుకులే ఎంత వివరణ కలం గళం
లలిత సంగీతం పాడగా గళం గుంభనంగా
గుండె సందులునుండి చూస్తున్న కవికి
కాంతను కావ్యకన్యకగా చూపమంది!!!