ఊహలన్నీ ఊసులై
ఊహలన్నీ ఊసులై
మది లోపల ఊహలన్నీ మౌనపు
అంచున దాగి పెదవి దాటనంటున్నాయి
గుండెలోని సవ్వడులన్నీ కలలకౌగిట్లో,
కనురెప్పల నీడల్లో దోబూచులాడుతున్నాయి
ఎదలోపలి అనుభూతులన్నీ నిశిరాతిరి తారకలై,
నిశీధిలో వేకువలై నిట్టూర్పుల జడివానలో తడిసిపోతున్నాయి
నా ఊహలన్నీ ఊసులై మూగబోయిన వీణలై పల్లవించని
పాటలై నిదురించేతోటలో నిశ్శబ్దరాగాన్ని ఆలపిస్తున్నాయి

