ఊహల్లో
ఊహల్లో
నేను,
నింగి మల్లె రెమ్మ వంచి,
నక్షత్ర పువ్వులు వలుచుకుంటాను,
నన్ను అనుమతించండి.
నేను,
నింగి సరస్సులో మునిగి
చంద్రబింబ పద్మాన్ని కోసుకుంటాను,
నన్ను జలకాలాడ నీయండి.
నేను,
మేఘ శిలలను
పిండిగా చేసి
నీలి రంగులను పులుముకుంటాను.
నన్ను నివారించుకండి.
నేను,
ఆకాశపు పందిరి కింద
స్వప్నపు సెజ్జపై నిద్రస్తాను.
నన్ను ఊహల్లో విహరించ నీయండి.

