ఉంటాను
ఉంటాను
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
2
ముళ్ళనడుమ నేనున్నా..నవ్వుతూనె ఉంటాను..!
పరిమళిస్తు కలకాలం..పాడుతూనె ఉంటాను..!
నీ ప్రేమను తెలిపేందుకు..కోయకోయి నన్నెపుడు..
నీ కరుణను మనసారా..కోరుతూనె ఉంటాను..!
కోసి మాల కట్టువారు..చుట్టుకర్మ బానిసలు..
చెప్పకనే గాలివీచ..రాలుతూనె ఉంటాను..!
అంటుకట్టి ఎన్నికొత్త..జాతులో కనుగొంటివి..
తృప్తిపడని నిను చూస్తూ..నవ్వుతూనె ఉంటాను..!
మధువులోకి మందులోకి..విందులోకి నీ తోడు..
నీ ముచ్చట తీర్చేందుకు..ఒదుగుతూనె ఉంటాను..!
మిఠాయీలు పన్నీరులు..ఎన్ని తీర్లు వాడేరొ..
అహంకార పదసీమల..నలుగుతూనె ఉంటాను..!