STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ఉందిక్కడ

ఉందిక్కడ

1 min
1


పరవశాల పాఠశాల..మనసుగాక ఉందెక్కడ..!? 

శాంతినిచ్చు పర్ణశాల..తనువుగాక ఉందెక్కడ..!? 


సరిగమలకు పుట్టినిల్లు..అందమైన మౌనము కద.. 

సుస్వర సంగీతశాల..కణముగాక ఉందెక్కడ..!? 


ఒక మనిషిగ పుట్టేందుకు..పుణ్యమెంత చేసినావొ.. 

స్నేహపూర్ణ గంధశాల..తలపుగాక ఉందెక్కడ..!? 


నిశ్చింతగ మెలకువతో..ఉన్న నిన్ను చూడు నీవు. .

అగ్నిపూల దీపశాల..ఓర్పుగాక ఉందెక్కడ..!?


ప్రేమవిలువ తెల్పగల్గు..మాటలకై ప్రయాసేల.. 

విమలప్రేమ చంద్రశాల..నవ్వుగాక ఉందెక్కడ..!? 


साहित्याला गुण द्या
लॉग इन

Similar telugu poem from Romance