తుది లేని ఆటలో
తుది లేని ఆటలో
నీ పేరు చెప్పవా… మౌనాలు చెరపాలి
నీ పదము చూపవా… కన్నీళ్లు తేవాలి
తుది లేని ఆటలో నిను గెలిచి ఓడాను
ఆ ముడిని విప్పవా…చరణాలు చేరాలి
భ్రమరమై తిరిగాను భ్రమలుగా మిగిలాను
ఆ తెరలు దించవా…. ప్రాణాలు విడవాలి
నువు లేని చోటేది నినుచేరు దారేది
ఆ గుట్టు తెలుపవా…. నాకట్లు తెంపాలి
నిలువెల్ల భక్తిగా నిలిచింది నీ సత్య…
నవ్వుతూ పిలవవా.. మరణాలు గెలవాలి….

