తొలి తొలి తొలకరి
తొలి తొలి తొలకరి
తొలితొలి తొలకరిగా కురిసావే నువ్వు ఓ చినుకా......
గిలిగిలి జలతారల్లే ఇల చేరావా తుంటరి తునకా..
ఎందుకే నాపై కినుకా
నిలువునా తడిపేయక
తడి తపనల తాకిడిగా
ఒడి చేర్చావే నీ కానుక
తలపడక ఉండనుగా నా సరి నీవేగా
మెలిపడక పడవే శృతిగా సరిగమ రాగంగా
నీలో నన్ను కలిపాక
తడిసిన మనసు మైకంగా
వయసే ఊయలయ్యాక
ఊహల జగతే చేరంగా
గారంగా పిలవంగా
నను తడిపే వాన నీవేగా
సింగారంగా అమరంగా
ముత్యపు జల్లు వై రా యింకా
స్వాతి వాన కురవంగా
మెరిసే నింగి కరగంగా
భువి చేరే సురగంగా
నాలో ఇమిడే తమకంగా..............

