తొలి కవిత్వ హితవరి
తొలి కవిత్వ హితవరి

1 min

394
ఎప్పుడూ విన్నాను మధురమైన పాటలు,
ఎప్పుడూ ప్రయత్నించలేదు తెలుసుకోనకు వాటి భావాలు |౧|
ఒకనాడు వినెను సుస్వర సంగీతం,
దాంపత్యభాగస్వామి వివరించెను ఆ చమత్కార గీతం |౨|
తెలిసెను పాటలోని అంతరార్థం,
గ్రహించెను పాటలోని పరమార్థం |త్రీ|
ఆలోచించిన మనసు చెప్పెను నాలుగు వాక్యాలు,
పదాలు సమంగా జోడించగా అయ్యెను పద్యాలు |౪|
విని ఇంకొన్ని వ్రాయమని అందరు ఇచ్చెను ప్రోత్సహం ,
తొలి కవిత్వ హితవరి వలన పెరిగింది పద్యరచన పై ఉత్సాహం |౫|