"తనకై"
"తనకై"
నా కలల రాజ్యంలో తనకై చేసే నిరంతర యుద్ధం
కనిపించేనా తన నయనానికి ??
నా హృదయపు అలజడి తనకై చేసే నిశబ్ధ శబ్ధం
వినిపించేనా తన శ్రవనానికి ??
నా "పవన"పు ప్రవాహంతో తనకై పంపే సు"గంధపు" పరిమళం
చేరేనా తన నాసికానికి ??
నా మనసు లోగిళ్ళలో తనకై చెందే ప్రేమ పదం
పలికేనా తన అధరములు ??
లేక,
తనకు సంరక్షణ గా చాచిన నా కరములే తన పాలిట కబంధ హస్తాలుగా తను భావించి దూరమాయేనా...??

