STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తన సొగసు

తన సొగసు

1 min
7


ఏ వెన్నెల జల్లైనా..తననవ్వుకు సాటిరాదు..!

ఎంత పాలపుంతైనా..తన సొగసుకు సాటిరాదు..!


పలకరించు ఒక బంగరు..చేమంతియె తాను కదా..

ఏ పూవుల మధువైనా..తన చూపుకు సాటిరాదు..!


పోలికతో అవసరమే..లేని అందమెట్లుండును.. 

ఏ తారక మెఱుపైనా..తన సొగసుకు సాటిరాదు..!


సూత్రాలను సృష్టించే..పనికన్నా గొడవేదోయ్..

ఏ మెఱుపు దాడైనా..తన పరుగుకు సాటిరాదు..!


ప్రతి పూవున పొంగు రంగుమాటు కళలెన్నో..

ఎంత ఇంద్రధనువైనా..తన తలుపుకు సాటిరాదు..!


Rate this content
Log in

Similar telugu poem from Romance