తన ప్రేమ
తన ప్రేమ
తన పిలుపు పాటయ్యింది
తన ప్రేమ వరదయ్యింది
తన పలుకు బలమయ్యింది
తనువంతా తుళ్లిపోగా
మనసంతా మురిసిపోగా
నేడే ఈ ఆనందము
చెంత చేరి నన్ను
కుశలమడిగింది
తెలుపకనే తెలిపాను
కుశలమని
బాషకు చాలని భావమేదో
మనస్సు పొందింది
కళ్లకు కనిపించని అందం
నామెదడు పొందింది
కమ్మని కావ్యములా
ఇలా రాయసాగింది

