తిమ్మక్కకు
తిమ్మక్కకు
ఏ చెట్టుకు ఆ చెట్టే..మొక్కేనా తిమ్మక్కకు..!
కోటి చెట్లు నివాళులే..పలికేనా తిమ్మక్కకు..!
ప్రాణాలను పెట్టినాటి..ప్రాణాలే పోసిపోయె..
మౌనవేదనా సుధలే..పంచేనా తిమ్మక్కకు..!
తనపిల్లలు పాపలవే..ఆస్తులవే పుడమిసాక్షి..
ప్రేమ సంతకాలుగాను..నిలిచేనా తిమ్మక్కకు..!
"సాలుమరద"సేవకెన్ని..అవార్డులో వచ్చెనేమొ..
తమ ఊపిరి మాధురులే..ఒలికేనా తిమ్మక్కకు..!
కర్నాటక 'పద్మశ్రీ'ని..ఎన్నినోళ్ళ పొగిడేమట..
శోకసంద్ర వనసీమయె..తలచేనా తిమ్మక్కకు..!
ప్రకృతి పరిరక్షణ యజ్ఞమెలా చేయాలో అసలు..
సూర్యభగవానుడెంతొ..మెచ్చేనా తిమ్మక్కకు..!
