తీరం తడవని పాదం
తీరం తడవని పాదం
సంద్రం కలగంది తీరం తడపని పాదాలకు పారాణితో..
మురిపించే మువ్వల సవ్వడితో వీనులకు ప్రణయరాగంలా..
ఆ నీలి కన్నులలో బందీ చేసి బయటకు రానీయక..
మాయ మాటలతో దోచేయాలని
నా హృదయ స్పందనను..
ఆమె చేతిలో చేయి వేసి నడిచా..
ఏడడుగులతో ఏకమైన
కౌగిలి బంధం వీడలేక..
వీడుకోలు పలికానే కానీ
మనసు నిలవనివ్వదే..
ఎంత వేగంగా వెనుకకు మళ్ళానో అంతే విసురుగా..
ప్రేమ లావాలా పొంగి ఎదను ముంచెత్తాను..
ఆమె నవ్వుల పువ్వులు విసిరింది గమకంతో..
మిణుకుల తారక వంచనతో
ముగ్గులోకి దింపి మాయమైంది..
అదిగో ఆనాటి నుంచి
ఈనాటి వరకు..
నాలో చెలరేగే సంఘర్షణల
కెరటాలకు విరామమే లేదుగా..
విరహపు బడబానలం కడుపులో దాచుకుని ప్రశాంతత నటిస్తూ..
దారిస్తున్నా దయలేని నావలకు
