STORYMIRROR

Midhun babu

Drama Fantasy Others

4  

Midhun babu

Drama Fantasy Others

తీరం చేరని కలలు

తీరం చేరని కలలు

1 min
6



తరువులు కొత్త చిగురులు తొడిగిన వేళ
పూబాలపరిమళం మలయమారుతాన విరిసిన వేళ ..
వసంతపు రమణీయమైన హృదయాన నను చేరవా?

వేసవి సూర్యుడు మండిపడే వేళ
ఆమని జ్ఞాపకల ఎదురుచూపుల వేళ..
గ్రీష్మపు కఠినతలో జలధారవై నను చేరవా?

మేఘపుపిలుపు ఆకాశాన విస్తరిస్తున్న వేళ 
మట్టివాసన మత్తెక్కిస్తూ అంతరంగం ఉప్పొంగేవేళ..
అవనిని తాకే మొదటి వాన చినుకువై నను చేరవా?

ఆకాశం మేఘాలను విడిచి నిర్మలమైన వేళ 
రేయివెన్నెల నక్షత్రాలతో మధురంగా ఊసులాడే వేళ..
శరదృతువు చంద్రికలా నీ చిరునవ్వుతో నను చేరవా?

ఉదయపు గుసగుసలతో జగము నిండిన వేళ 
మంచున తడిసిన గడ్డిపూలు ప్రేమతో ఆహ్వానించే వేళ..
హేమంతపు పొగమంచులాంటి నిశ్శబ్దంతో నను చేరవా?

ప్రకృతి మౌనంగా పూల సువాసనలతో జతకట్టే వేళ 
చల్లనిగాలి పొడి ముత్యాలల్లే తాకుతున్న వేళ..
శిశిరపు మృదువైన ఊహాజాలంలా నను చేరవా ?



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama