STORYMIRROR

# Suryakiran #

Drama

4  

# Suryakiran #

Drama

తీరం చేరిన ప్రేమ !

తీరం చేరిన ప్రేమ !

1 min
377

ప్రేమ ఏ వయసువారిలోనైనా కలిగే

ఒక మధురభావన .

ప్రేమించాలనే అభిలాషతో వారిలో

మొదలౌను ఆరాధన .


ఊహల్లో తేలుతుండగా

ఆశలు మనసుసముద్రంలో ఉరకలు .

ఉత్సాహభరితమయ్యేవి

వారిరువురి హృదయస్పందనలు .


కొన్నిరోజులు లేఖలు

ఆకాశంలో నీలిమేఘాల్లా సందేశాలతో .

రంగురంగుల పూలు

కలల్లో వర్షంలా దివ్యానుభూతులతో .


ఒకరినొకరు చూసుకుంటూ

వలపుబాణాలు తనువులను ముద్దాడగా .

మాటలు తేనెఊటల్లా

జీవితంలో మరింత దగ్గర చేయగా .


ఎప్పటికీ ఒక్కటై

ఆనందంలో భవిష్యత్తును కనుగొనుచూ .

అలా ప్రేమ తీరానికి చేరి

హరితవనంలో విహరింపజేయుచూ !!



Rate this content
Log in

Similar telugu poem from Drama