తెలుసుకో
తెలుసుకో
ఏ కన్నుల్లో ఎన్ని కన్నీళ్లు దాగున్నాయో.
ఏ మనస్సు లో ఎంత బాధుందో.
ఏ దేహానికి ఎన్ని చెప్పాలేని కథలున్నాయో.
ఏ జీవితం ఆశ తో కొట్టుమిట్టాడుతుందో.
కదిలించి చూడు ఎన్నివేల గాయాలో.
పలకరించి చూడు ఎన్ని మాటలు మూగబోయాయో.
తెలియలేని నిజలెన్నో దాగున్నాయి.
బాధ తో బరువైన గుండెలెన్నో.
బ్రతుకు పోరులో తెలియని యుద్ధాలెన్నో.
దాచుకున్నా నిజలెన్నో.
దాయబడిన అబద్ధా లేవో.
కంటికి కనబడని సాక్ష్యాలేవో.
ప్రతి మనిషిని కదిలించి చూడు
అనుకున్నాది ఒక్కటి జరుగుతుంది మరోటి.
తాను అనుకున్నా జీవితాన్ని
ఎలా గడుపుతున్నాడో అర్థమవుతుంది.
ప్రతి మనిషి వెనుక తెలియని పెద్ద
యుద్ధమే దాగుంది తెలుసుకుంటే ..
