తెలుగందు
తెలుగందు
జాతీయ జెండాకు..శ్వాసయే తెలుగందు..!
నిజత్యాగ నిరతికే..నేతయే తెలుగందు..!
తూటాకు గుండెలే..చూపెలే ధీటుగా..
స్వేచ్ఛా పతాకాల..పాటయే తెలుగందు..!
ప్రగతిశీలత కొరకు..ప్రాణాలు పెట్టునది..
గోదావరీకృష్ణ..గంగయే తెలుగందు..!
సంస్కృతీ రక్షణకు..కవచమై నిలిచెరో..
గురుసంప్రదాయాల..తోటయే తెలుగందు..!
పోరాట పటిమనే..ఉగ్గుపాలుగ పట్టు..
నరనరములో ప్రేమ..ఊటయే తెలుగందు..!
అందాల తెలుగమ్మ..నవ్వులా తారకలు..
పుడమిపై బంగారు..బాటయే తెలుగందు..!
