STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

తెలియలేదు

తెలియలేదు

1 min
3


నే వ్రాసిన ప్రేమలేఖ..అందిందని తెలియలేదు..! 
చెలి తానే గాలిముద్దు..పంపిందని తెలియలేదు..! 

కన్నులింట తననాట్యం..వర్ణించగ తలచలేను.. 
నా వాడని శ్వాసగతిని..నిలిపిందని తెలియలేదు..! 

ఆరిపోని దీపముతో..మాటలాడు విధమేదో.. 
చెప్పకనే మౌనముగా..నేర్పిందని తెలియలేదు..! 

కలతలేవొ కలలేవో..తేటపరచి మాయమయ్యె.. 
ఓ సాక్షిగ ఈ 'నేను'ను..మలచిందని తెలియలేదు..! 

బడియేదో గుడియేదో..కణకణమో ఆలయమే.. 
సత్యమేదొ బోధపరచి..జరిగిందని తెలియలేదు..!

అద్భుతాలు వేరేగా..ఉండవంటు నవ్వివెళ్ళె.. 
వింతహాయి చిరునామా..ఇచ్చిందని తెలియలేదు..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics