STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తాను 💥💥💥

తాను 💥💥💥

1 min
374


దర్ప దరహాసాల దుర్భిణీ తాను

దుఃఖ సుడిగుండాల దూప తాను


కలత నలత కొంగుల కొమ్మయే

కూరిమి కులుకు పలుకులే తాను


వలబోతల అల వలల జాబిల్లి

విరహవేదన విసుగు నురగే తాను


మౌనస్థ ముగ్ధ మనోహర రూప

మౌనిక ముసినవ్వుల కలువ తాను


అపరాధ పరాభవ ఆక్రోశాల దీప

ఆణిముత్య అలంకార అబల తాను.


జానపద కళారూప కలికి గీతిక

జవసత్వాల జన్మనిచ్చు జనని తాను


చందన"చంద్రికల చపలాక్షి లలిత

చకోర చక్షువుల చకుముఖి రవ్వతాను...!!

       


Rate this content
Log in

Similar telugu poem from Romance