తాను - నేను!
తాను - నేను!
తాను - నేను.. !
నేను మండే గ్రీష్మపు తాపాన్ని ఐతే,
తానొక చల్లని మలయమారుతం..
నేనొక పిల్ల కాలువను ఐతే,
నన్ను తనలో కలుపుకునే స్వచ్ఛమైన నది తాను.
నేను నిశీధి నీడలో సంచరించే నిరాశావాదిని ఐతే,
అభ్యుదయ భావాల ఆశాకిరణం తాను..
బురదలో పుట్టిన కలువను నేనైతే,
నన్ను వికసింప చేసే పున్నమి వెన్నెల తాను.
నింగిలో నేనొక తారను ఐతే,
తారను దాచుకున్న విశాలాకాశం తాను..
నేను సప్త స్వరాల సంగీతం ఐతే,
సంగీతానికి ప్రాణం పొసే..
స. రి. గ. మ. ప. ద. ని. స.. లు తాను..
మా పయనం ఎందాకో..
మా గమ్యం ఎటువైపో...
శ్రీ...
హృదయ స్పందన..
