తామర పువ్వు
తామర పువ్వు
మౌనంగా తన ఉనికిని చాటుకునే
ఏకైక పుష్పం తామర పువ్వు..
బురద నీటిలో పుట్టినా బాధ పడదు..
మురికి కుంటలో పెరిగినా మలినం అంట నీదు...
చుట్టూ ముళ్ళ పొదలు గుచ్చి గుచ్చి చూస్తున్నా
అదరదు బెదరదు...
ప్రకృతి సహకరించకున్నా నిటారుగా
నిలబడటం మానదు..
ఎంతో అందం గా వికసించి..
మరెంతో పవిత్రం గా దేవుని పాదాల
చెంతకు చేరడమే తన పరమావధిగా భావించే ఏకైక పూల మొక్క..

