Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Drama Romance Classics

4  

SATYA PAVAN GANDHAM

Drama Romance Classics

"స్వప్న సుందరి"

"స్వప్న సుందరి"

1 min
443


👉నువ్వులా చూస్తుంటే అలసిపోవా నీ కనురెప్పలు,

👉నువ్వులా మాట్లాడితే అదిరిపోవా నీ పెదవులు,

👉నువ్వు పీల్చి వదిలిన గాలి పరిమళిస్తుంది,

👉నువ్వు తెరిచిన చెవులు ఆహ్వానం పలుకుతుంది.


👉నున్నటి నీ చెంపలు, వాటిపై ఏర్పడిన ఆ పుట్టుమచ్చలు

   పట్టపగలే ఆకాశంలో చుక్కలు చూస్తున్నట్టుంది.

👉పొడవాటి నీ నాసికము, వాటిని ఆనుకున్న ఆ   

   కనుబొమ్మలు

   చిన్న కొండల నడుము జారే జలపాతాన్ని తలపిస్తుంది.

👉మృదువైన పెదవులు, దానిని కదిలిస్తున్న ఆ కంఠస్వరము

   చెవిటివాడిని కూడా కదిలించేంత వినసొంపుగా ఉంది.


👉మెట్టలు లేని నీ కాళ్ళు సవ్వడి చేయకపోయినా...

   నీ పాదముద్రలతో ఈ నేల పులకరిస్తుంది.

👉ఆభరణాలు లేక నీ మెడ వొంపు బోసిగా మారినా...

   నీ కురుల తాకిడితో అది హోయలొలుకుతుంది.

👉గాజుల లేక నీ చేతులు వెల వెల బోయినా...

   వాటిని పట్టుకుని నీతో చెలిమి చెయ్యాలని నా మనసు   

   ఉవ్విలూరుతుంది.


👉ఇన్నేల్లొచ్చినా బహుశా నాకిప్పటివరకూ 

   ఆడ వాసనన్నది తగల్లేకో మరి,

   లేక ఈ పల్లెటూరి మొద్దు ఇంకా ఈ పట్నపు పద్ధతులకు   

   అలవాటు పడకో మరి,

👉మీరెవరితోనో చనువుగా ఉంటే మాత్రం 

    అదే మనసు ఎందుకో తల్లడిల్లిపోతోంది.

👉నీ అంద చందాలకి దాసోహమైన నా పిచ్చి హ్రుదయం    

   అంతకుమించి ఈర్ష్య పడుతుంది.


👉నీతో కలిసి నడిచిన ప్రయాణం కాస్త దూరమే అయినా

👉అది ఎన్నో తెలియని మధురానుభూతులు నేర్పిస్తుంది.

👉ఇంతకుమించితే ప్రమాదమో ఏమో అనిపిస్తుంది.

👉నా వాక్యాలు శ్రుతి మించితే మన్నించండి.

👉అసలు అర్థమే కాకుంటే క్షమించండి.


- Satya Pavan Writings...



Rate this content
Log in

Similar telugu poem from Drama