STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Inspirational

4  

స్వాతి సూర్యదేవర

Inspirational

స్వాతంత్ర్యమా ఎక్కడ నీవు..?

స్వాతంత్ర్యమా ఎక్కడ నీవు..?

1 min
305

సాధించిన స్వాతంత్ర్యమా ఎక్కడ నీవు...?

ఎన్నో అరుణోదయాలను రక్తతిలకాలతో మేల్కొలిపిన వీరులతో పాటే కనుమరుగైనావా....!?

సాధించిన స్వాతంత్ర్యమా ఎక్కడ నీవు...?

వాక్స్వాతంత్రంలో....విచ్చలవిడి దారుణకాండలలో నలిగిపోయావా....!?

సాధించిన స్వాతంత్ర్యమా ఎక్కడ నీవు...?

తెంచిన దాస్యశృంఖలాలను చూసి సంతసపడుతుండగానే

పరుగున పరాయివారి పంచన చేరిన మేధావుల చూసి గగనమేగినావా....!?

సాధించిన స్వాతంత్ర్యమా ఎక్కడ నీవు...?

అత్యాచారాలతో అశువు బాసిన మగువులతో పాటు మట్టిపాలైనావా....!?

సాధించిన స్వాతంత్ర్యమా ఎక్కడ నీవు...?

సొంతలాభాలకై రోజుకొక జెండా మార్చే రాజకీయ స్వాతంత్ర్యాన్ని చూసి విసుగు చెంది జీవం వదిలినావా....!?

సాధించిన స్వాతంత్ర్యమా ఎక్కడ నీవు...?

ప్రగతిబాటలో నడవాల్సిన జనులు.. ఓటు అమ్మకానికై నోటుకి ప్రలోభపడ్డారని దిగులుతో మొహం చాటేసినావా...!?

సాధించిన స్వాతంత్ర్యమా ఎక్కడ నీవు...?

జెండా పండుగలోనా....!? , లేక నేతలు ఇచ్చే ప్రసంగాలలోనా...!?

సాధించిన స్వాతంత్ర్యమా ఎక్కడ నీవు...?

కోట్లధనాన్ని కొల్లగొట్టి దాచినా..., దాగిన జనుల వెంట పరుగిడినావా...!?

సాధించిన స్వాతంత్ర్యమా ఎక్కడ నీవు...??

వజ్రోత్సవ వేడుకలకై సిద్ధమవుతున్నవా? లేక ప్రతి సంవత్సరం నీవున్నావని చెప్పే రోజుకై ,నీ ఉనికికై ఎదురుచూస్తున్నవా!?

మిత్రమా..!! ఇక్కడ నేను.

మారుతున్న యువత ఆలోచలలో...

మారుతున్న మహిళ శక్తి,యుక్తులలో...

మారుతున్న ప్రజల తిరుగుబాటులో...

మారుతున్న నీ బతుకు చిత్రంలో...

మారుతున్న పరాయిబాటకు వద్దనుకున్న మీ యోచనలలో....

నన్ను సాధించడానికి అసువులు బాసిన వీరుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ దేశ సైనికుని ప్రతి శ్వాసలో..

నన్ను కాపాడాలని శ్రమిస్తున్న ప్రతి పౌరుడి మాటలో,చేతలో...

ఇంకా బ్రతికే వున్నాను నేస్తమా..!!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational