STORYMIRROR

Midhun babu

Drama

4  

Midhun babu

Drama

స్వార్థం

స్వార్థం

1 min
5

మీరే చెప్పండి? 


ఒకరిని చంపితే హత్య

దోచుకుంటే దోపిడి


వేలమందిని చంపితే

లక్షల మందిని దేశం నించి వెళ్లగొడితే

సంపదనంతా నిర్వీర్యం చేస్తుంటే

దేశాన్ని శవాలదిబ్బ చేస్తుంటే


అధికారమా? 

అహంకారమా?

ఆధిపత్యమా?

నిరంకుశత్వమా?


ఏది నిన్ను శాశ్వతం చేసేది? 

ఏది నీకు తృప్తినిచ్చేది? 

ఏదిశాంతినిచ్చేది? 


ఇంతమంది హృదయ ఘోష

ఆవేదన

ఆక్రోశం

ఆక్రందన

ఏంచేస్తాయంటారు? 


మనుషులను

బూడిద చేసి

రక్తం చల్లి

మాంసపుముద్దలను

భక్ష్యం చేసే

రాక్షసుడా


చరిత్రలో శాశ్వతమైన అపకీర్తి

లిఖించబడేది

మాత్రం సత్యం! ! 

కాదంటారా?


Rate this content
Log in

Similar telugu poem from Drama