సుమధురం
సుమధురం
నీతలపు వెన్నెల్ల..చెలిమియే సుమధురం..!
నీ కరుణ వానతో..రేయియే సుమధురం..!
నా ఊహలేలేవు..లీలగా చాలులే..
నీనవ్వు మల్లియల..నగరియే సుమధురం..!
మంత్రాలు వేవేలు..ఎందుకో పలకడం..
నీ పేరు విందైన..గాలియే సుమధురం..!
నడకలో తడబాటు..రానీవు ఏవేళ..
ముందున్న నీవెలుగు..దారియే సుమధురం..!
నాటకం వింతగా..తోచుటే వింతలే..
నీ సహజ సౌందర్య..సృష్టియే సుమధురం..!
నావైన భావాలు..నీ మౌన ధారలే..
నీ వేణు రాగాల..రవళియే సుమధురం..!

