సరికొత్త మధువేదొ
సరికొత్త మధువేదొ
క్షణమెంతొ గడుసరిగ..కవ్విస్తు ఉంటుంది..!
సరికొత్త మధువేదొ..అందిస్తు ఉంటుంది..!
వీడునా స్నేహాల..కాంతినే పంచునా..
భవితనే చిత్రముగ..ఊరిస్తు ఉంటుంది..!
విరహాన్ని పాన్పుగా..పరిచేసి వెళ్ళెనా..
కలహించు తలపును..దహియిస్తు ఉంటుంది..!
రేపటికి రూపేదొ..ఊహలో దేనికో..
ఆశపడు కర్మలో..మరణిస్తు ఉంటుంది..!
సంకల్ప మేదైన..రాలనీ స్వార్థమే..
పరమార్థమే సరిగ..బోధిస్తు ఉంటుంది..!

