STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Classics Inspirational Others

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Classics Inspirational Others

సోయగాల నీడ!

సోయగాల నీడ!

1 min
320


పల్లె సాయంత్రం

అలసిన పగటి యంత్రమై విశ్రాంతి 

తీసుకునేలా

శాంతించిన సూరీడు

కొండల చాటున కునుకు తీసేందుకు

ప్రకృతి ఒడిలో సేదతీరేలా....

పయనమై వెళ్తున్న వేళ


ప్రకృతి అంతా.......

నిశ్శబ్దంతో కూడిన గువ్వలరాగం

కొండల్లో పురివిప్పి నాట్యం చేసే

మయూరాలు

వాటి చుట్టూ లెక్కకు మించి

తనివితీరా చూసేటి 

వాటి ప్రియురాళ్ళు

కృష్ణుని నాదస్వరానికి సమ్మోహితులైన

గోపికలను తలపిస్తున్న దృశ్యం

అందాల ప్రణయలోకంలో 

విహరించేలా చేస్తుంటే


బారులై

గుంపులుగా గూటికి చేరే

పక్షుల ప్రయాణం

గగన వీధిలో

సైనిక విన్యాసాల్ని తలపించేలా

విహంగాల చప్పుళ్ళు కవాతుశబ్దంలా

వినిపిస్తూ....

ఐక్యమత్యానికి ఆదర్శమైన

విషయాన్ని గుర్తుచేస్తున్నాయి


మెల్లగా పయనించే నీలి మేఘాలు

చల్లని సాయం సంధ్య పైరగాలికి

ప్రకృతి అందాల్ని వీక్షిస్తుంటే

కూర్చున్నచోట వెలుగు రేఖలన్ని మాయమై

చీకటి తెరలను కప్పుతున్న వేళ

మెరిసే నక్షత్రాలను చూస్తుంటే....

మదనపడే మనసు

కాస్త సంతోషాన్ని అనుభవిస్తున్నట్టు 

అనిపిస్తుంది


ఈ సోయగాల నీడలో...

నా నీడ మాయమై...

మది పరవశించే...అందమైన దృశ్యాల్ని చూయిస్తూ...

నా హృదయ స్పందనతో... అద్భుతమైన కవిత్వం రాయిస్తోంది.


శ్రీ...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics