స్నేహం...
స్నేహం...
మనసుకు భారం తోచినపుడు
కానరాని స్నేహం
కలత కన్నీరుగా మారి జాలువారుతున్నపుడు
వారించరాని స్నేహం
అగాధపు అంచుల్లో పడిపోతున్నపుడు చేయందించని స్నేహం
ఆదుకోమని అర్ధిస్తున్నపుడు
సమయమీయని స్నేహం
మాట మాత్రానికైనా నేనున్నానని
భరోసా ఇవ్వలేని స్నేహం
అవసరానికి పలకరింపుల స్నేహం
అసలేమిటో అర్ధం కాదీ స్నేహం...
... సిరి ✍️

