STORYMIRROR

# Suryakiran #

Abstract

4  

# Suryakiran #

Abstract

స్నేహితుడు

స్నేహితుడు

1 min
414

మాటలురాని పసివయసులో

కేరింతలకు మురిసేవాడు .


బడిబాటలో నేర్చుకొనుటలో

ఒక ప్రేరణగా నిలిచేవాడు .


సాహసోపేతమైన యువతరంలో

ప్రశంసిస్తూ నడిచేవాడు .


బాధ్యతాయుతమైన జీవితంలో

అండదండలతో మెలిగేవాడు .


కష్టంలో కన్నీటిని తుడుస్తూ

సంతోషంలో నవ్వులు చిందిస్తూ


ఆశలను అనుక్షణం కలిగిస్తూ

ఆశయాలను ఓర్పుతో స్వాగతిస్తూ


ప్రతి అడుగులో , ప్రతి మలుపులో

మంచిమనిషిని నాలో చూసేవాడు .


*** # *** # ***



Rate this content
Log in

Similar telugu poem from Abstract