STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

స్నేహ సుధల మందారం

స్నేహ సుధల మందారం

1 min
379

హృదయ హాస మందారం..నీ సొగసై..పూసింది..!

స్నేహ సుధల మందారం..నీ నవ్వై..పూసింది..!


నీవు లేక ఉండలేదు ఏ క్షణమూ అద్భుతమై..!

మధుర భావ మందారం..చందనమై..పూసింది..!


నడువకనే నడిపింతువు..గతులన్నిటి గమకమువై..!

సుస్వరాల మందారం..సుమధనువై..పూసింది..!


పలుకకనే పలికించే పద లహరుల సునాదమా..!

వినోదాల మందారం..నవ వధువై..పూసింది..!


స్వర్ణ కమల పరిమళమది విందు చేయు మనోహరీ..!

స్వప్న గగన మందారం..శుభ తరువై..పూసింది..!



Rate this content
Log in

Similar telugu poem from Romance