STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సందె వేళ

సందె వేళ

1 min
219

సందెవేళ...

చందమామ చూడమాకే దొంగచూపులు 


మబ్బుతెరలుదీసిమరీ చూడ దగుననా 


ఇన్నిసొంపులెందుకనీ ఏమిప్రశ్నలోయ్ 


కొంటిమామ ఇంటికొచ్చే వేళ కదోయి !!


మల్లెపూలు పూసింది నీకోసం కాదులే 


చెలయేటి పరవళ్ళు నిన్నుచూసికాదులే 


చిలిపినవ్వునవ్వుతూ నువ్వుపరిచినీవెన్నెల


పరవశించు మనసుకు పందిరాయెనీవేళ 


మనసుపాడు పాటకు వేణువాయెనే ఇలా 


దొంగచూపు చూడకోయి చందమామా


అందగాడి వేళకి, నన్నుండనీ ఇలా...!!!

      


Rate this content
Log in

Similar telugu poem from Romance