STORYMIRROR

Kadambari Srinivasarao

Inspirational

4  

Kadambari Srinivasarao

Inspirational

సమాధి కట్టుకుంటున్న స్వార్ధం

సమాధి కట్టుకుంటున్న స్వార్ధం

1 min
217

పుడమితల్లి పొట్ట చీల్చుకుని

ఒక విత్తు జీవం పోసుకుంటుంది

జన్మనిచ్చిన తల్లి తన బిడ్డను

శ్రద్ధగా కాస్తూ ఉనికికి ఊతమై

పట్టును సాధించే దిశగా తీర్చి దిద్దుతుంది


మహా వృక్షంగా ఎదిగిన పసిమొక్క

శాఖల సంతానాన్ని విస్తరించి

జీవకోటి ఆధార భూతమౌతుంది


తరువుల సిరులను మాత్రం 

లెక్కకు మిక్కిలి మింగుతూ 

స్వార్ధ నర భక్షకుడు అవసరం తీరేంతవరకూ 

తల్లి రొమ్ముగుద్ది మరీ అమృతాన్ని చేజిక్కించుకుంటాడు


అంతటితో తృపికి ఆశ చావదే!

బ్రతికినంత కాలం ఫలములిచ్చిన

తరువుతల్లి తనువును కూడా

తనకు ఆలంబనగా మార్చి

పలు అవతారలెత్తిస్తాడు!


బరువు మోసే పుడమితల్లి పచ్చని గుండెలపై

కాంక్రీటు కోటింగ్ వేసి 

మింగ మెతుకు దొరకని స్థితికి కారణమై

అలంబనకు సజీవ సమాధి కడుతూ

తన సమాధికి తానే కారణమౌతున్నాడు


Rate this content
Log in

Similar telugu poem from Inspirational