STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సజీవ స్మృతులే...

సజీవ స్మృతులే...

1 min
293


అప్పుడెప్పుడో నువ్వన్న ఒకే ఒక్క చిన్న మాట

ఎక్కడెక్కడో పూలపరిమళాలను మోసుకొస్తూ

వెచ్చని ఊపిరిగా మారి

 నాలో విలీనమవుతుంటుంది.


ఉదయభాను కిరణంలా

గుచ్చుకునే నీ చూపుల తాకిడి

లేత చిగురాకుల కొమ్మలలో 

రాలిన మంచు బిందువులా

ఒకోసారి వెచ్చగా మరోసారి చల్లగా మారి

గిలిగింతలు పెడుతుంటుంది.! 


క్షణాలన్ని యుగాలైన వేళ 

పెదాలు మూగబోయిన వేళ

మరపురాని జ్ఞాపకమొకటి

సన్నజాజి తీగలను సున్నితంగా మీటే చిరుగాలిలా 

నా ముంగురులు సవరించి వెళ్ళిపోతుంటుంది! 


ఎప్పటెప్పటో పదాలను చేర్చి కూర్చి

ఇప్పుడు ఇక్కడొక అందమైన కావ్యంగా

మలచాలని ఉంది........ 


అత్యంత అద్భుతంగా అనిపించే 

నా ప్రతి క్షణం వెనక దాగున్నది నువ్వే

నువు చిలకరించి తొలకరించిన జ్ఞాపకాలే 

నిన్నటి సాయంత్రాల సజీవ స్మృతులే...


... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance