STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

సిసలైన స్వాతంత్ర్యం

సిసలైన స్వాతంత్ర్యం

1 min
141

మోగింది ఎన్నికల ఢంకా

నేతల తలరాతలు తెల్చే

భవితవ్యం తెలుసుకునే

సమయం ఆసన్నమైంది

ప్రజల తీర్పుకు

పట్టం కట్టే అవకాశం

ఓటరన్నా!నీ ఓటే

సుపరిపాలనకు

శిరోధార్యం!

నీఓటే

వ్యక్తిత్వానికి

వజ్రాయుధం!

నీ ఓటే

సంధించే

అస్త్రం!

నీ ఓటే

ప్రజాస్వామ్య

విలువలకు

బ్రహ్మాస్త్రం!

ఒక్క సిరాచుక్క

విలువైన పాశుపతాస్త్రం

ఆలోచించి సంధించు

తప్పక ప్రయోగించు

సార్థకం గావించు

ఓటుకు నోటును ఖండించు

నేతల భవితను తేల్చు

నీ తలరాతను మార్చు

ఓటు విలువను పెంచు

అవినీతిని తుంచు

నవసమాజం నిర్మించు

సిసలైన స్వాతంత్ర్యపు

స్వేచ్ఛను వివరించు

భారతావని ముద్దుబిడ్డగా

కీర్తి గడించు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy