సిరి సిగ్గేలో
సిరి సిగ్గేలో
సిగ్గు దొంతరల ముగ్ధ మనోహరి
సిఖలో తురిమే నిఖిసజ్జల కేసరి
సింగారపు సిందూరపు గడసరి
సొగసు వంపు కంకణాల అల్లరి
సొంపుల సుగంధ భరిత భావరి
సంతోష తోటల పరదాల కల్వరి
సరిగమ పాటల పద పాదవల్లరి
సారంగ సిగ్గు అధరాల హిమగిరి
సంగీత కళానిధుల స్వర మాధురి
సంపెంగ సువార్త సురగంగల పోరి
సంధ్యాకిరణ సవ్వడి అలల్లో చేరి
సిరిగజ్జెల సింగమ నడకల చెకోరి
సుతార నాహృది వీణతీగగా మారి
స్పృజించ వచ్చావా కలల రాకుమారి..!!

