సీతార
సీతార
తను ముద్దుగ మీటినంత..పలుకునులే తను'సితార..!
తనతలపుల మునిగినంత..పాడునులే తను'సితార..!
పరవశించు భావనమది..తానిచ్చిన కానుక కద..
నిలువరించి కోరినంత..ఆడునులే తను'సితార..!
చేమంతుల నిత్యనూత్న..వనమేదో చిగురించెను..
పరిమళింప జేసినంత..పంచునులే తను'సితార..!
రేపవళ్ళ వ్యత్యాసము..లేదుకదా కాలానికి..
చెలిమిమెఱుపు తాకినంత..నవ్వునులే తను'సితార..!
ఒక శిశిరపు సాక్షిలాగ..ఉన్న మనసు దక్కిందా..
జ్ఞాపకాలు వీడినంత..వెలుగునులే తను'సితార..!

