సిగ్గుపూల
సిగ్గుపూల
సిగ్గుపూల గోదావరి..పాటలోన ఒదిగింది..!
వలపు పూల గోదావరి..శ్వాసలయగ చేరింది..!
ఇంద్రచాప వర్ణాలకు..జన్మనిడే హేమలత..
మంచుపూల గోదావరి..మదిలోయల ఉరికింది..!
కనులమాటు గగనాలను..ఏలుతున్న కలహంస..
మెఱుపు పూల గోదావరి..మనోవీణ మీటింది..!
జాబిలితో మంతనాలు..జరుపుతీరు నేర్పునట..
పలుకుపూల గోదావరి..పరవశించి పొంగింది..!
చెలి తానై వడ్డించును..చైతన్యపు విందునే..
వెలుగుపూల గోదావరి..మౌనముగా చూసింది..!
తేనెకన్న తియ్యనిదట..మధువేదీ నెగ్గదట..
తెలుగుపూల గోదావరి..హృదయనిధిగ మారింది..!
