STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సిగ్గొదిలిన చూపులు

సిగ్గొదిలిన చూపులు

1 min
239

కనులముందు కనబడితే చూపులెన్ని పుడతాయో

సిగ్గొదిలిన చూపులలో పరుగులెన్ని పుడతాయో


తడియారని కురులలోన మబ్బులెన్ని పుడతాయో  

రవి తాకిన బిందువులకు మెరపులెన్ని పుడతాయో


అద్దానికి అందాలను పొరబాటున చూపించకు

కదలలేని వస్తువులో తపములెన్ని పుడతాయో


పూవులంటి పదములతో బాటలోన నడిచి చూడు 

అడుగుల్లో సుగంధాల మడుగులెన్ని పుడతాయో


నిను చూడని వేళలోన వొక్కసారి నన్ను చూడు

ప్రేమించని మనసులోన వలపులెన్ని పుడతాయో


వేసుకున్న మేలిముసుగు తొలగిస్తే 

చూసిన చీకటి తనువున కాంతులెన్ని పుడతాయి 


Rate this content
Log in

Similar telugu poem from Romance