శుభరాత్రి
శుభరాత్రి
నిర్మలమైన ఆకాశం ఇస్తుంది స్వాగతం
పక్షిలా స్వేచ్చగా విహరిధ్ధమని,
అందమైన ప్రకృతి అందిస్తుంది ఆహ్వానం
హాయిగా భూమాత ఒడిలో సేదతిరమని,
చల్లటి రాతిరి లో పిలుస్తుంది చందమామ
నీకు అమ్మాల చందమామ కథలు చెప్తానని,
మెరుస్తున్న చుక్కలు రమ్మంటున్నాయి
నిన్ను ఈ ప్రపంచానికి మెరిసేలా చేస్తానని,
కలల్లో విహరిద్దమని ఊహలు పిలిచాయి
నువ్వు కలలు గన్న ఊహల సామ్రాజ్యనికి తీసుకెళ్తానని,
హాయిగా వినమని సంగీతం చెప్పింది
మనస్సులో ఉన్న బాధనంతా తీసేస్తామని,
కనుల పై కమ్మగా నిదుర వచ్చింది
అంత మనమంచికే,ఏమి ఆలోచించకుండా హాయిగా నిద్రపోమ్మాని,కమ్మగా మురళీగీతం పాడింది.