STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

శుభోదయం

శుభోదయం

1 min
248

వృక్షాన్ని ప్రశ్నించకు 

నీకు ఈ నీడని, పండ్లను

ఇవ్వడం వలన

ఏమి లభిస్తుంది అని

ఉదయభానుని ఎన్నడూ ప్రశ్నించకు

నీ కిరణాలతో ప్రజ్వరిల్లిన కాంతిని

ఇవ్వటం వలన ఏమి లాభం నీకని

సముద్రాన్ని ప్రశ్నించకు వర్షాన్ని కురిపించడం వలన నీకేం లాభమని

తల్లిదండ్రులను ప్రశ్నించకు

నిన్ను తీర్చి దిద్దడం వలన

 ఏమి లాభమని

నీ మిత్రునికి ఎన్నడూ అడగకు

నేను నీకు జ్ఞాపకం ఉన్నానా అని

ఈ ప్రశ్నలకు జవాబు

తెలిసిననాడు నీవు

మనిషివి కావు

మహానుభావుల లో

నీవు ఒకడివి 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational