శరదృతువు
శరదృతువు
అశ్వయూజ,కార్తీక మాసాలు తోలుకొచ్చే ఋతు మార్పును
వేకువేమో వేగిరిపడి వెళ్లిపోతూ
చలియేమో రేకకట్టు తోన కంపం పుట్టించే
పొగ మంచు గిరుల గములు నింగి నేల నొక్కటి చేసే
నులి వెచ్చగా భానుడి కిరణాలు సోకగా
పచ్చని పసిరికపై ముత్యపు సరులేసినట్టు వెలుగు హిమపు బిందువులతో
మాగి పొద్దుపొడిసి వడివడిగా,పగలు పరుగులెట్టి కదలగా
నడి జామున ఆతపము ప్రతాపము చూపగా
గోధూళి వేళ పడమటికి చేరి చెదిరముతోడ సింగారించుకున్న భాస్కరుడి అందాలతో
రేయి గూకి మేఘద్వార మింటిన వేవేల కాంతులతో
చల్లని పండు వెన్నల కురిపించగా చలువలరేడు
తెల్లని మల్లెలు విరిసి పరిమాళాల గంధాలు గుప్పించగా
మనసున హాయి మరల మరల మరుల గొల్పగా
రేయి జగుగా కరుగుతూ వచ్చే శరదృతువు
@హరాక్షరా 3074@

