STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

శ్రావణంలో నదిని నేను

శ్రావణంలో నదిని నేను

1 min
369

మేఘాల్లో నీటిని నేను

నీ మాటల్లో భావం నేను

పూవుల్లో సువాసన నేను

నీ పోపుల పెట్టె వాసన నేను


కాటుకలాంటి చీకటి నేను

నువ్వు కొనాలనుకునే సెంటును నేను

బాదం చెట్టు ఆకును నేను

నువ్వాడే చికుచికు పుల్లను నేను


బెరుకు లేని బంధం నేను

మధ్యాహ్నం వేళ డబ్బింగ్ ఆనందం నేను

ఉప్మాలో వేసిన ఊరగాయ రుచిని నేను

నీ అభిరుచిని నేను


శ్రావణంలో నదిని నేను

పర్వతాలు మైదానాలు దాటి

సాగరమైన నీలో కలుస్తాను

నీలో నిలుస్తాను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract